చోడవరం ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చోడవరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల దేవరపల్లి మండలం వాకపల్లి గ్రామంలో నాటు సారా తయారీ స్తావారాలపై దాడులు నిర్వహించి నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న 200 లీటర్ల బెల్లపు పులుపును ద్వంసం చేశారు. అనంతరం దేవరపల్లి మండలం బొడ్డపాడు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి నాటు సారాయి సేవించడం వల్ల కలిగే దుష్ఫలితాలను గ్రామస్తులకు వివరించారు. ఈ దాడులలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కే. హనుమంతు వారి సిబ్బంది హెచ్సీలు ఏం అప్పలనాయుడు, సిహెచ్ అప్పల నాయుడు, పిసీ లు భీమలింగేశ్వర్ రావు , రాంబాబు పాల్గొన్నారు.
