Home News తన కథలను తానే ఆవిష్కరించుకున్న యండమూరి వీరేంద్రనాద్

తన కథలను తానే ఆవిష్కరించుకున్న యండమూరి వీరేంద్రనాద్

0

.డిసెంబర్ 25న వస్తున్న “యండమూరి కథలు”

అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, స్టూవర్టు పురం పోలీసుస్టేషన్ లాంటి అనేక చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వంలో “అతడు ఆమె ప్రియుడు, నల్లంచు తెల్ల చీర” లాంటి చిత్రాలను నిర్మించిన భీమవరం టాకీస్ బేనర్ లో రూపొందిన చిత్రం “యండమూరి కధలు”. యండమూరి కలం నుండి జాలువరిన 4 కధలు తీసుకొని చిత్రం గా మలచి డిసెంబర్ 25 న విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం టీజర్.. ఈ రోజు శ్రీ యండమూరి వీరేంద్ర నాధ్ పుట్టినరోజు సందర్బంగా వారి చేతులుమీదుగా నే విడుదల చేసారు. ఈ “యండమూరి కధలు ” చిత్రాన్ని రవి బాసర దర్శకత్వంలో భీమవరం టాకీస్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో భవ్య, దేవి ఆనంద్, ఆయుష్, కుషాలిని,రామసత్యనారాయణ, కౌశిక్, నాగేశ్వరావు గోల్కొండ, అరుణ్, అర్జున్, కరణ్, రాంజై నటించగా సంగీతం యశస్వి, కెమెరా విమల దిలీప్, ఎడిటింగ్ ఆలోషవు, పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, దర్శకుడు రవి బాసర, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. అతి త్వరలో యండమూరి రాసిన మరో ప్రముఖ సూపర్ హిట్ నవల “అంతర్ముఖం” సెట్స్ కి వెళ్లనున్న సందర్బంగా మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో. కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ పి. ర్. ఓ. భట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణ,కొత్త శ్రీనివాస్, కోట్ల నాని మరియు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version