అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్టేషన్ ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందిని సత్కరించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో కేక్ కట్ చేసి ఉత్సాహంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం ఉమెన్ కానిస్టేబుల్స్ ఉషా, పద్మ, సీతా, శైలజ, ఉషా లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
అలాగే చిన్నారి బుడితి స్వేచ్ఛ స్వాభిమాన్‌ను ఎస్సై శ్రీహరి శాలువా కప్పి ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్సై శ్రీహరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళల ధైర్యం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. చిన్నారులు కూడా విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ రైటర్ భగవాన్ దాస్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
