Saturday, April 18, 2026
HomeUncategorizedవిత్ మై ఓల్డ్ ఫ్రెండ్... అంబాసడర్ కారుపై చంద్రబాబు పోస్ట్

విత్ మై ఓల్డ్ ఫ్రెండ్… అంబాసడర్ కారుపై చంద్రబాబు పోస్ట్

  • విత్ మై ఓల్డ్ ఫ్రెండ్
  • అంబాసడర్ కారుపై చంద్రబాబు పోస్ట్
  • గత స్మృతులు నెమరవేసుకున్న సీఎం

(అమరావతి – జయజయహే)

సెలబ్రిటీలు, పొలిటీషియన్స్​కు సంబంధించిన ప్రతిదీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. వారికి ఇష్టమైన కార్లు, ఫుడ్ మెనూ, వస్తువులు, పెంపుడు జంతువులు వంటివి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇదిలా ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎంతో ఇష్టమైనది తన అంబాసిడర్ అని తెలుస్తోంది. దానితో అతనికి ముప్పై ఏళ్ల అనుబంధం ఉంది. ఆ కారును ఎంతో అపురూపంగా చూసుకుంటారట. ఇప్పటివరకు రాజకీయంగా పరంగా కొందరికి ఈ కారు గురించి తెలిసి ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సాధారణ వ్యక్తులే కాదు పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీలు వరకు ప్రతీ ఒక్కరికి ఎంత ఎదిగినా కొన్ని మధుర స్మృతులు అయితే మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. వాటిని చూసుకుని మురిసిపోతుంటారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో ఉన్న ఏకైక కారు అంటే అంబాసిడర్ కారు అనే చెప్పవచ్చు మరి. దానికి ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు అంటే ఆశ్చర్యమే లేదు.

ఏపీ 09 జీ 393 నెంబర్ కలిగిన అంబాసిడర్ కారును చంద్రబాబు 30 ఏళ్ల కిందట ఉపయోగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వాహనంలోనే విస్తృతంగా పర్యటించేవారు. ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు సొంత వాహనం. దీన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

చంద్రబాబు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించి, దాంతో గతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 393 నంబరుతో ఉన్న అంబాసిడర్ వాహన శ్రేణిలో అప్పట్లో రాష్ట్రమంతా పర్యటించేవారు.

393 అంబాసిడర్ అంటేనే సీబీఎన్ బ్రాండ్ కార్ అనేలా అది గుర్తింపు పొందింది. ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతం ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నారు. తన సొంత కారు అయిన నాటి అంబాసిడర్‌ 393ను మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న ఈ కారును ఇటీవల మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు.

పార్టీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారును పరిశీలించి, ఆ కారులో తన ప్రయాణ స్మృతులను నెమరువేసుకొన్నారు. ‘విత్ మై ఓల్డ్ ఫ్రెండ్’ అంటూ ఆ కారుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఎక్స్‌ వేదికగా ఆ ఫోటోలు పంచుకున్నారు.

నా పాత మిత్రుడు 393 అంబాసిడర్‌: స్వయంగా సీఎం చంద్రబాబు తన ఎక్స్ వేదికగా ఫొటోలు షేర్ చేసి, దానికి తన సందేశాన్ని జోడించారు. అది ఏమిటంటే నా పాత మిత్రుడు 393 అంబాసిడర్‌తో కలిసాను. ఒకప్పుడు ఈ కారులోనే ఏపీ అంతా ప్రయాణించాను. దీంతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అంటూ సీఎం చంద్రబాబు తన 3 దశాబ్దాల నాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments