Home Politics Andhra Pradesh రాష్ట్ర సమాచార కమిషనర్ నాయుడుకి ఘన స్వాగతం

రాష్ట్ర సమాచార కమిషనర్ నాయుడుకి ఘన స్వాగతం

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా విశాఖపట్నం జిల్లాకు వచ్చిన పి.ఎస్. నాయుడుకి శనివారం ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో నరవ రాంబాబు, మాజీ స్పెషల్ మెజిస్ట్రేట్ పైల సన్నిబాబు, పరవాడ రాజేంద్ర, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు అధిక సంఖ్యలో హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పి.ఎస్. నాయుడు సంపత్ వినాయకుని దర్శనం చేసుకుని, అక్కడి నుంచి ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద జీవీఎంసీ అడిషనల్ కమిషనర్లు, మెడికల్ అండ్ హెల్త్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు, టీచర్లు, ప్రొఫెసర్లు, మాజీ విసి శశిభూషణ్ రావు, సమాచార పౌర సంబంధాలు అధికారులు, పోలీసు, ఎక్సైజ్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏజీపీలు
బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కృష్ణమోహన్, వివిధ సంఘాల ప్రతినిధులు, సమాచార హక్కు చట్టం దరఖాస్తు దారులు మరియు నగర ప్రముఖ ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య అధికారులు, అలాగే విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి మరియు అధిక సంఖ్యలో న్యాయవాదులు, మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పి.ఎస్. నాయుడు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version