Home Politics Andhra Pradesh త్రిమూర్తి శివ జయంతి మహోత్సవంలో పాల్గొన్న విఎంఆర్డిఏ చైర్మన్

త్రిమూర్తి శివ జయంతి మహోత్సవంలో పాల్గొన్న విఎంఆర్డిఏ చైర్మన్

0

మహా శివరాత్రి సందర్భంగా ప్రజా పిత బ్రహ్మ కుమారీస్ అధ్వర్యంలో ఎండాడలో నిర్వహించిన త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం లో అభిషేక లింగ దర్శనం, సహస్ర లింగ దివ్య దర్శనం కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పాల్గొని పూజలు జరిపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయ కారకుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి రోజున శివ ధ్యానంలో గడపాలని పేర్కొన్నారు. శివారాధనలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. ఈ సందర్భంగా ఎం వి ప్రణవ్ గోపాల్ ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అలానే పలువురు కళాకారులను ఎం వి ప్రణవ్ గోపాల్ చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం నగరం లో పలు శివాలయాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివ. ఆలయ ప్రతినిధులు చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ని ఘనంగా సత్కరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version