రాష్ట్రంలోనే టీడీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టిన మహా నగరం విశాఖేనని జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజ నేయస్వామి అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ కార్యవర్గం ప్రమాణస్వీకారం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. పార్లమెంట్ అధ్యక్షుడుగా చోడే వెంకట పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణ తదితర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్బంగా ఆయన
మాట్లాడుతూ విశాఖ టిడిపికి పట్టుకొమ్మని,ఎన్నికల్లో రాష్ట్రంలోనే పెద్ద
మెజారిటీలతో విశాఖ ఒక రికార్డ్ సృష్టించిందన్నారు. విశాఖను టిడిపి ప్రభుత్వంల్లో అభివృద్ధి చేస్తే వై సి పి హయంలో నాశనం చేశారని, తాము పోలవరం నీళ్లు అనకాపల్లి వరకు తెచ్చామన్నారు.
జగన్ కంటే పెద్ద చోర్ ఎవ్వరు లేరని, తండ్రిని అడ్డం పెట్టుకుని సంపద దోచుకున్నారని ఆరోపించారు. జగన్ ఐదేళ్ల పాలన భరించలేక విశాఖ ప్రజలు ఇంటికి పంపించారన్నారు. హోమ్ మంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ టీడీపీ అంటే ఒక గొప్ప స్ఫూర్తి అని, కార్యకర్త వల్లనే ఈ స్థానంలో ఉన్నామని అటువంటి కార్యకర్తను మరచిపోలేమన్నారు. ప్రభుత్వ విప్ పి వి జి ఆర్ గణబాబు మాట్లాడుతూ వైసిపి హయాంలో అప్పులేని మంగళవారం, అరెస్ట్ లేని శుక్రవారం, కబ్జా లేని స్థలం, భాద లేని మనిషి లేడని, అటువంటి వైసిపి నేత పాదయాత్ర చేస్తే గుంతలు లేని రోడ్లు కనిపిస్తాయన్నారు.
టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు చోడే పట్టాభిరాం మాట్లాడుతూ విశాఖలో అద్భుత మెజారిటీ లు ఇచ్చారని, విశాఖ అంటే చంద్రబాబు, లోకేష్ లకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికలో కూటమి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి నొడగల కృష్ణ మాట్లాడుతూ కార్యకర్తలకు మేలు చేసేది టీడీపీ పార్టీ అని సామాన్య వెనుక బడిన వర్గాలకు పెద్ద పీట వేసిన పార్టీ టీడీపీ అన్నారు. విశాఖ నగర నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు నూతన కార్య వర్గాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పి. విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ డాక్టర్ చిరంజీవి రావు, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతమ్ రాజు సుధాకర్, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జి, వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్,
రాష్ట్ర పార్టీ నాయకులు ఎండి నజీర్ తదితరులు పాల్గొన్నారు,
