Home Politics Andhra Pradesh రూ.411.45 కోట్ల మూలధనంతో మొదటి స్థానంలో వీసీబీ

రూ.411.45 కోట్ల మూలధనంతో మొదటి స్థానంలో వీసీబీ

0

ఎండాడలో 60వ బ్రాంచ్ ప్రారంభం*

*చైర్మన్ జె.వి సత్యనారాయణమూర్తి* .

ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ రూ.411.45 కోట్ల మూలధనంతో దేశంలోనే అర్బన్ బ్యాంకులలో మొదటి స్థానంలో ఉందని వీసీబీ చైర్మన్ జే. వీ.సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు.ఎండాడ రాజీవ్ నగర్ అన్నపూర్ణ నిలయంలో ప్లాట్ నెంబర్ 103లో మంగళవారం ఉదయం ఎండాడ బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో వీసీబీ 59 శాఖలను కలిగి ఉందన్నారు. వీటిలో 15 శాఖలు సొంత భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నారు. 60వ శాఖగా ప్రారంభం కానున్న ఎండాడ బ్రాంచ్ ను కూడా సొంత భవనంలో ఏర్పాటు చేసుకున్నట్లు జే.వీ. సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఎండాడ బ్రాంచ్ ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. ఎన్ .హరింధర ప్రసాద్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 8 బ్రాంచ్ లను ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. రూ.8,300 కోట్ల ఆర్థిక కార్యకలాపాలతో నడుస్తున్న వీసీబీ ఈ ఆర్థిక సంవత్సరం కార్యకలాపాల లక్ష్యాన్ని రూ.8,600 కోట్లు గా పెట్టుకున్నట్లు వివరించారు.దక్షిణ భారతదేశంలో అతిపెద్ద అర్బన్ బ్యాంక్ గా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు వృద్ధి సాధించింద న్నారు. ఈ సమావేశంలో ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్లు జి జనార్దన రావు, సిహెచ్ ఆదినారాయణ శాస్త్రి, యు. పార్వతీదేవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ .రామకృష్ణారావు, ప్రధాన కార్యాలయ అధికారి సిహెచ్. వి. ఆర్. సుబ్రహ్మణ్యం, బ్రాంచ్ మేనేజర్ జి .పద్మావతి పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version