దక్షిణ నియోజకవర్గం వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కార్యకర్తకు రూ. 5000 ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. 29వ వార్డు వైసిపి అధ్యక్షుడు పీతల వాసు ద్వారా విషయం తెలుసుకొని పార్టీ కార్యకర్త ముగుడ రాజేష్ ఇంటికి వెళ్లి మెడికల్ ఖర్చులకు సొంత నిధులతో అందజేసి పరామర్శించారు. ఇటీవల ఆకస్మికంగా పెరాల్సిస్ రావడంతో కేజీహెచ్ లో జాయిన్ అయ్యారు. పేదరికం మరోపక్క కుటుంబానికి పెద్ద మంచాన పడడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం తెలుసుకుని వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబానికి భరోసా కల్పించారు. ధైర్యంగా ఉండాలని త్వరగా మళ్ళీ పూర్తి ఆరోగ్యం కోలుకోవాలని కార్యకర్తతో కాసేపు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని, తాను కూడా వారి కష్టాల్లో అందుబాటులో ఉంటానని వాసుపల్లి గణేష్కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
