చోడవరంలో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ 49వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు,దేవాలయంలో ఉన్న దేవత మూర్తులు కి విశిష్ట అలంకరణ, ప్రసాద వితరణ, సాయంత్రం అమ్మవారికి 49 కేజీల లాడు, 108 మంది భక్తులచే అందించబడిన సారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరేశ్వర , కోనక కోమల జనార్ధన స్వామికి కళ్యాణ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం వాసవి యూత్ క్లబ్, వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ అందరి సహకారంతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ కలగర్ల శేషగిరిరావు, కార్యదర్శి
పూసర్ల వెంకటరమణమూర్తి , క్యాబినెట్ సెక్రటరీ పసుమర్తి మల్లిక్, క్యాబినెట్ ట్రెజరర్ సత్యవరపు శ్రీనివాసరావు, ఆర్ చిన్న రాజలింగం గుప్తా,డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ కొల్లూరు మణికుమార్,ఆర్ ఎస్ నాలం మూర్తి , యూత్ క్లబ్ ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ, సెక్రెటరీ పచ్చిగోళ్ళ నాగేశ్వరరావు, ట్రెజరర్ఆన్ హరికుమార్, వికేఎస్పి ఇంచార్జ్ బత్తుల శ్రీనివాసరావు,ఫాస్ట్ ప్రెసిడెంట్స్ , డైరెక్టర్లు క్లబ్ మెంబర్స్ , శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
