Home News ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సిపి పోర్టు పోరాటం విజయం

ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సిపి పోర్టు పోరాటం విజయం

0

మూలపేట పోర్టు కు తరలివచ్చిన ప్రజలు

కూటమి పాలనపై ధ్వజమెత్తిన వైయస్సార్సీపి నేతలు

ఉత్తరాంధ్ర ప్రాంత మణిహారం ఇక్కడ ప్రజల చిరకాల స్వప్నం కొండంత ఆశతో అభివృద్ధి జరుగుతుందని ఎదురుచూస్తున్న ప్రజలకు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పనులు కూటమి ప్రభుత్వ పాలనలో నత్త నడకగా కొనసాగడంపై వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర నేతలు అభిమానులు ప్రజలు పోర్టు సత్వరమే పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని డిమాండ్ తో టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పేరాడ తిలక్ పిలుపు మేరకు నాయకులు , ప్రజలు, కార్యకర్తలు కదిలి రావడంతో పోర్టు కు పదండి పోదాం కార్యక్రమం విజయవంతం అయింది.

ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సిపి కీలక నేతలంతా ఒకే వేదికలో సమాయుత్తమై కూటమి ప్రభుత్వ పాలకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, పోర్టు నిర్మాణ పనులను పూర్తి నిర్లక్ష్య ధోరణిలో కొనసాగుతుందని కూటమి ప్రభుత్వంలోని కేవలం ఒక కుటుంబం ఆదిపత్య ధరణి తో పనులు ఆలస్యం కావడం తగదని ఇది కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ల అలసత్వం వల్లే పోర్టు నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని దీనిపై ప్రజా పోరాటమే శరణ్యమని పోర్టు కు పదండి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా ఆమోదం పొందామని మరెన్నో నిర్లక్ష్య ధోరణిలో ఉన్న ప్రాజెక్టులపై ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గం ఇన్చార్జ్ పేరాడ తిలక్ స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధికారతకు 4 వేల 361 కోట్ల రూపాయలతో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 70 శాతం పనులు పూర్తి కా వచ్చాయని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణాలు 70 శాతం పనులు మా ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తి అయ్యాయని కూటమి వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని వైయస్సార్ సిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు.
ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రజలు అభివృద్ధి చెందే మార్గాలకు ఆనాడే అన్ని పనులు పూర్తయ్యాయని టెక్కలి నుంచి మూలపేట వరకు 325 ఎకరాలను సేకరించారు అన్నారు, విష్ణు చక్రం గ్రామానికి 149 కోట్లతో పునరావాసము కల్పించారని రైల్వే లైన్ కోసం 100 ఎకరాలు సేకరణ జరిగిందని అన్ని పనులు అప్పట్లోనే పూర్తి అయినాయని ఇంకా కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏమి మిగిలి ఉన్నాయని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు , రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ చాలా అవసరమని భవిష్యత్తులో ప్రజలు అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుచూపు తో ఆలోచనలు చేశారని ఇది కూ టమి ప్రభుత్వా పాలకులకు నచ్చలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. కలిసికట్టుగా ఐక్యమత్యంగా ప్రజల కోసం పోరాటం చేసి మన పార్టీ ఆశయాలను ప్రజల మధ్యకు తీసుకెళదామని పలువురు వైయస్సార్సీపి కీలక నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నేతలు బొత్స సత్యనారాయణ , ధర్మాన కృష్ణ దాస్ , ధర్మాన ప్రసాదరావు, సీదరి అప్పలరాజు,కుంభ రవి బాబు, రేగం మత్చ్య లింగం, దువ్వాడ వాణి, పేరాడ తిలక్ పాల్గొన్నారు.పోలీస్ శాఖ ఎ టువంటి ఆ వాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు నిర్వహించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version