శ్రీ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ సత్యవోలు రాంబాబు ఆధ్వర్యంలో హోటల్ దసపల్లాలో జరిగిన ఉగాది పురస్కారాలు 2026 లో భాగంగా వివిధ రంగాలలో సేవలందించిన పలువురికి అవార్డ్స్ ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన విశాఖపట్నం నగర పోలిస్ కమీషనర్ శంఖబ్రత భాగ్చీ మరియు ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల చేతులమీదుగా అవార్డుల ప్రధానం చేశారు. కార్యక్రమంలో భాగంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించి, వివిధ సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ల్యాండ్ పవర్ ఎం డీ ఆర్. రామకృష్ణ ను ఎంపిక చేసి అవార్డు ప్రధానం చేసారు.
కార్య నిర్వాహాకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ కృష్ణ వివిధ సామాజికసేవల్లో పాలుపంచుకొని చేసిన సేవలను ఎంతగానో ప్రశంసించి కొనియాడారు. ముఖ్యంగా ఆయన మార్కెటింగ్ రంగంలో వేలాది మార్కెటింగ్ మిత్రులను తనతో పాటు కోటీశ్వరులుగా తయారు చేయడానికి శిక్షణ ఇచ్చి వారు స్వంత ఇల్లు కారు కోనుకునేటట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిని తయారు చేశారు. మరియు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా విధ్య, వైధ్యం మరియు ఆధ్యాత్మిక సేవలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సమాజశ్రేయస్సుకు తోడ్పడ్డారు అని ప్రశంసించారు. ఇందులో భాగంగా ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మక విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు.
అవార్డు స్వీకరించిన అనంతరం రామ కృష్ణ మాట్లాడుతూ, ఈ పురస్కారం తనకు గౌరవం మాత్రమే కాదు అని సమాజానికి ఉపయోగపడే విధంగా ఇంకా ఎక్కువ మందిని ముందుకు తీసుకువెళ్ళేలా నా ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. సమాజానికి సేవ చేయడం తన ధ్యేయమని ల్యాండ్ పవర్ కంపెనీ తరపున ఖచ్చితంగా కృషి చేస్తానని, తనవంతు సేవలను అందిస్తానని తెలిపారు.
