Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshగుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరుకీ గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరుకీ గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. చీడికాడ మండలం వరాహపురం గ్రామానికి చెందిన పెయింటర్ పీ.గంగు నాయుడు ,పి.దేముడు నాయుడులు సబ్బవరం లో పెయింటింగ్ పనులు పూర్తిచేసుకుని తిరిగి ప్రయాణంలో బుధవారం వరహాపురం వెళ్తూoడగా అడ్డూరు గ్రామం వద్ద మోటార్ బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గంగనాయుడికి కుడికాలు రెండు ముక్కలుకాగా, దేముడు నాయుడుకు చెయ్యి కూడా విరిగింది .దీంతో వీరిరువురిని 108 అంబులెన్స్ లో విశాఖ కెజీహెచ్ కు తరలించగా
వారికి చికిత్స నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments