Home Politics Andhra Pradesh డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ కార్యక్రమం

డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ కార్యక్రమం

0

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, పీఎం ఉషా పథకం గ్రాంట్లతో 7 రోజుల డ్రోన్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. చిట్టబ్బాయి చైర్‌పర్సన్‌గా వ్యవహరించగా, మర్రిపాలెం కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధ కన్వీనర్‌గా వ్యవహరించారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య వనరుల వ్యక్తిగా వి . శివ కార్తికేయ , సీఈఓ, కేడర్ హరి హేమ ఆక్సిజన్ డ్రోన్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొన్నారు. డ్రోన్ టెక్నాలజీలో ఉన్న విభిన్న అవకాశాలు, వివిధ రకాల డ్రోన్లు, థర్మల్ డ్రోన్లు, మెడికల్ డ్రోన్ ట్రైనింగ్, మల్టీస్పెక్ట్రల్ డ్రోన్ ట్రైనింగ్ వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. మిలిటరీలో ఉపయోగించే ఎమ్ క్యూ 9, ఆర్ క్యూ 4 వంటి డ్రోన్ల ప్రాధాన్యతను వివరించి, విద్యార్థినులను డ్రోన్ టెక్నాలజీ రంగంలో శిక్షణ పొందేందుకు ప్రేరేపించారు.
వైస్ ప్రిన్సిపాల్ డా. వి.కే.టి. మహాలక్ష్మి డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యతపై మాట్లాడుతూ విద్యార్థినులకు ప్రోత్సాహన్నిచ్చారు గణితశాస్త్ర లెక్చరర్ మంగమ్మ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ తన ప్రభావవంతమైన మాటలతో విద్యార్థినులను తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ప్రేరేపించారు. భౌతిక శాస్త్ర లెక్చరర్ డా. రాజు బాబు తన ప్రత్యేక శైలిలో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ శిక్షణ భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర లెక్చరర్ కుమారి , రసాయన శాస్త్ర లెక్చరర్ డా. శ్రీవిద్య గారు, జంతుశాస్త్ర లెక్చరర్ డా. కృష్ణ , ఆంగ్ల లెక్చరర్ డా. జి. మేరీ పుష్ప సహా కళాశాల అధ్యాపకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version