Home Politics Andhra Pradesh టపాసుల గోడౌన్ లను తనిఖీ చేసిన ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘు వంశీ

టపాసుల గోడౌన్ లను తనిఖీ చేసిన ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘు వంశీ

0

శ్రీ లక్ష్మీ గణపతి టపాసుల గోడం సీజ్*

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన టపాసుల ఫ్యాక్టరీ పేలుడు దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తగా తిరుపతి జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీ జిల్లాలలోని పలు ప్రాంతాల లో టపాసుల గోడౌన్లను,దుకాణాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు తాహసిల్దార్ భారతితో కలసి మండలంలోని టపాకాయల దుకాణాలను, గోడౌన్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.దుకాణదారులను లైసెన్సు మరియు స్టాక్ వివరాలను అడిగి తెలుసుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలంటూ దుకాణదారులకు తెలియజేశారు.శ్రీకాళహస్తిలోని పి.వి రోడ్డు లో ఉన్న లక్ష్మీ గణపతి టపాసుల దుకాణం నందు సరైన రక్షణవలయం లేకపోవడంతో దుకాణాన్ని సీజ్ చేశారు. తొట్టంబేడు తాసిల్దార్ భారతి మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు తిరుపతి జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం లో ఉన్న టపాసుల నాలుగు దుకాణాలను గోడౌన్లను తనిఖీలు చేసి లక్ష్మి గణపతి అనే టపాసుల గోడౌన్ ను సరైన సేఫ్టీ లేకపోవడంతో గోడౌన్ ను సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో రేపు ఆ దుకాణాన్ని సీజ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఎస్ఐ నరసింహులు,ఆర్ఐ లు సుజాత,నారాయణ,వీఆర్వో దినేష్, కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version