కేపింగ్ సెర్మనీలో కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి
రోగులకు వైద్య సేవలు అందించి భవిష్యత్తులో ఉన్నత నర్సులుగా గుర్తింపు తెచ్చుకోవాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి అన్నారు. కేజీహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో కొత్తగా జనరల్ నర్సింగ్‌లో జాయిన్ అయిన విద్యార్ధులకు కేపింగ్ సెర్మనీని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్ధులందరితో నైటింగేల్ ప్రతిజ్ఞ చేయించారు. నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ మంగా దేవి ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వాసవీలత, డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీ హరి, గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ కుమారి, వైస్ ప్రిన్సిపల్ సామరాజు, ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్షకార్యదర్శులు గంగా భవానీ, జీవీఎస్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
