Home Politics Andhra Pradesh వైభవంగా అప్పన్న పెళ్లి చూపులు

వైభవంగా అప్పన్న పెళ్లి చూపులు

0

కళ్యాణానికి ముహూర్తం

ఉగాది రోజు పెళ్లిరాట పెళ్లి కుమారునిగా అలంకరణ

ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం గా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి డోలోత్సవం (పెళ్లిచూపులు) మంగళవారం అంగరంగ.. వైభవంగా జరిగింది.. తెల్లవారుజామున ఒంటిగంటకు స్వామిని సుప్రభాత సేవతో మేలుకొలిపిఆరాధన గావించారు.. నాలుగు గంటలకు మెట్లు మార్గం ద్వారా బోయిలు కొండ దిగువకు తీసుకువచ్చారు.. అక్కడ నుంచి స్వామి నేరుగా తన సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయం కు చేరుకున్నారు.. అమ్మవారి దర్శనం అనంతరం తన కుమార్తెను వివాహం చేసుకోవాలని అమ్మవారు ప్రార్థిస్తారు.. ఆలోచించుకొని చెబుతానని గ్రామ మధ్యకు చేరుకున్న స్వామి పుష్కరిణీ సత్రంలో ఉయ్యాలలో ఆసీనులు అవుతారు.. అక్కడ డోలీలో విశేష పూజలు జరిపించుకొని వసంతోత్సవం చూర్ణోత్సవం అనంతరం గ్రామ తిరు వీధికి బయలుదేరారు.. గ్రామ ప్రజలు మంగళహారతులతో స్వామి వారిని స్వాగతించారు.. ఆ తర్వాత మరోసారి పైడితల్లి అమ్మవారు ఆలయానికి చేరుకొని అమ్మ వారి కుమార్తెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తారు.. దీంతో స్వామి వివాహం ఖరారు
కావడంతో అర్చక వర్గాలు.. అధికారులు.. ఉద్యోగులు.. భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని కేరింతలు కొట్టారు. ఈవో వెంకటరావు దంపతులు . ఈ పూజల్లో పాల్గొనగా ఏఈవోలు.. ఉన్నతాధికారులు అంతా పాల్గొన్నారు.. అర్చక స్వాములు అందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. సింహాచలం దేవస్థానం ఈ ఓ జె.వెంకటరావు ఆధ్వర్యంలో
ఉత్సవానికి విశేష ఏర్పాట్లు చేశారు.. ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. డోలిలో కొలువున్న స్వామి వారి దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని ఆలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ తెలిపారు. సింహాద్రి నాథుని పెళ్లిరాట ఉగాది పర్వదినం రోజు వేయనుండగా.. అదే రోజు పెళ్ళికొడుకు అలంకరణ గావిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల లోపు అన్ని ఉత్సవాలు పూర్తి చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version