Home Politics Andhra Pradesh రెవెన్యూ క్రీడలకు రంగం సిద్ధం

రెవెన్యూ క్రీడలకు రంగం సిద్ధం

0

మార్చి 13 న రెవెన్యూ శాఖ ఆటల పోటీలు

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖ ప్రతిష్టాత్మకమైన క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది మానసిక వికాసం, ఉత్సాహం , ఆరోగ్యo పరిరక్షణకు క్రీడలు ఎంతో అవసరం.
మార్చి 13 నుంచి 15 వరకు జరిగే రెవెన్యూ క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలు చక్కని వాతావరణంలో జరిగి రెవిన్యూ శాఖ ఉద్యోగుల్లో మంచి ఉత్సాహం తీసుకురావాలని భావనతో ప్రతి ఒక్కరు ఉన్నామని ఈ మేరకు మర్యాదపూర్వకంగా టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం కృష్ణమూర్తి ని రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సమీక్షలో పాల్గొన్నారు, వీలైనంతవరకు అన్ని మండలాల నుంచి ఎక్కువమంది రెవెన్యూ క్రీడాకారులు పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఆర్డిఓ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి డి వి ఎస్ ఎన్ రాజు, కోశాధికారి నాయక్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి ఐ లింగరాజు, పలాస డివిజన్ అసోసియేషన్ అధ్యక్షులు రెయ్యి రామారావు, టెక్కలి అసోసియేషన్ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, కోశాధికారి కె నారాయణ లు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version