Home Politics Andhra Pradesh వరబాపనమ్మ అమ్మవారి జాతరామహోత్సవాలు

వరబాపనమ్మ అమ్మవారి జాతరామహోత్సవాలు

0

గోకవరం మండల కేంద్రం గోకవరం గ్రామం కొత్తపల్లి రోడ్డులో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ వరబాపనమ్మ అమ్మవారి మహోత్సవాలు 25 వ తేదీ బుధవారం ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ మహోత్సవాలలో 25వ తేదీన మహాకుంభాభిషేకం, 26 న జాగరణ, భజన కార్యక్రమం, 27 న దేవీ వైభవం ప్రవచనం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. 28 వ తేదీ శనివారం లోకకళ్యాణర్థం, సర్వ భక్తజన సంరక్షణార్థం అమ్మవారికి ఐదుగురు దంపతులచే చండీ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీవారు తెలియజేశారు. ఉదయం 10 గంటలకు అమ్మవారి చీరలు, లడ్డూ ప్రసాదం వేలం, 11 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో మహా అన్నసంతర్పణ నిర్వహించబడునని,ఈ సదవకాశాన్ని భక్తులు వినియోగించుకుని తీర్థదప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ కోరారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version