గ్రామీణ ప్రజల కళ్ళల్లో ఆనందమే సరైన అభివృద్ధి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్న
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల గ్రామీణ పేద ప్రజల కళ్ళల్లోని ఆనందమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం లో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు,
గ్రామాల్లోని మంచినీటి అవసరాలను తీర్చేందుకు కోటబొమ్మాలి మండలం పట్టుపురం పంచాయతీ, మణి నాగేశ్వర పురం గ్రామంలో రూ 17,60 లక్షల అంచనా తో రక్షిత మంచినీటి పథకానికి తెదేపా నాయకులు, గ్రామస్తుల సమన్వయంతో శంకుస్థాపన చేశారు. ఈ గ్రామంలో సుదీర్ఘకాలంగా మంచినీటి సమస్య ఉందని, ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించేందుకు త్వరితగతిలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని అన్నారు, ప్రజా మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ముఖ్య సంకల్పమని మంత్రి అచ్చన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
