Saturday, April 18, 2026
HomeUncategorizedమోసగాడు బుచ్చిరెడ్డి అతి తెలివి...!

మోసగాడు బుచ్చిరెడ్డి అతి తెలివి…!

` రూ.70లక్షలు తీసుకుని ‘బుచ్చిరెడ్డి’ మోసం చేశాడు!
` చీటర్ బుచ్చిరెడ్డిపై సీపీకి ఫిర్యాదిచ్చిన మధురవాడ మహిళ

విశాఖ మహా నగరంలో మహా మోసగాడుగా పేర్గాంచిన
చింతపల్లి బుచ్చిరెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తుల్ని కూడబెట్టి, పలువురిని మోగించిన బుచ్చిరెడ్డి తెలివిగా కోర్టును ఆశ్రయించాడు. తనపై విశాఖ పోలీసులు పెట్టిన కేసులన్నీ బూటకమని, వెంటనే వాటన్నింటినీ ఎత్తివేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై నగర పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తాను కూడా భారీ ఎత్తున నష్టపోయానని, తనకెలాంటి సాయం చేస్తారో చెప్పాలని బుచ్చిరెడ్డి కోరడం వింతగా ఉందంటున్నారు. పదుల కొలదీ స్టేషన్లలో ఫిర్యాదులందుతుంటే చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని బుచ్చిరెడ్డి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, ఆయన్ను వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆధారాలన్నింటినీ న్యాయస్థానం ఎదుట సమర్పిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉంటే మోసగాడు చింతపల్లి బుచ్చిరెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ప్రజల నుంచి భారీ ఎత్తున నగదు, బంగారం, ఆస్తులు కాజేసిన బుచ్చిరెడ్డి వ్యవహారం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా బుచ్చిరెడ్డిపై కేసులు నమోదు కాగా, మధురవాడలోని శ్రీరాం పనోరమా హిల్స్‌కు చెందిన చింతలపాటి కష్ణవేణి అనే మహిళ కూడా మరో ఫిర్యాదు చేశారు. తన వద్ద నుంచి రూ.70లక్షలు తీసుకుని బుచ్చిరెడ్డి మోసం చేశారంటూ తాజాగా ఆమె విశాఖ సీపీ బగ్చీని ‘పీజీఆరఎస్ ద్వారా ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బుచ్చిరెడ్డి మోసపూరితంగా కుట్రపన్ని తన బంగారం, ధవపత్రాలు తీసుకున్నారని బాధితురాలు ఆరోపించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బుచ్చిరెడ్డి తనను ఆశ్రయించాడని, నమ్మకంగా నటించి తన బంగారం, విలువైన పత్రాలు లాక్కున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.70లక్షల విలువైన సొత్తు తీసుకుని బదులుగా రూ.30లక్షలు తనకిచ్చారని, అయితే రూ.30లక్షలు తిరిగిచ్చేసినా, తన రూ.70లక్షల సొత్తు మాత్రం బుచ్చిరెడ్డి తిరిగివ్వలేదని బాధితురాలు కష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లు చేస్తుంటే ఎత్తడం లేదని, పదేపదే అడుగుతున్నా ఆయన నుంచి స్పందన లేదని, తద్వారా తాను మానసిక వేదనకు గురయ్యానని, ఆర్థికంగా కూడా నష్టపోయానన్నారు. తన వద్ద ఆధారాలున్నాయని, బుచ్చిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కష్ణవేణి నగర పోలీస్ కమిషనర్‌ను కోరారు.
..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments