Home Politics Andhra Pradesh ధర్మానికి మూలం గోవు

ధర్మానికి మూలం గోవు

0

గో సంపదను కోపాడుకోవాలి*

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

ధర్మానికి మూలమైన గోవును, గోసంపదను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని, ఇది వ్యక్తి బాధ్యత కాదు, సమిష్టి బాధ్యత అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అవుకు మండలం, కొండమనాయుని పల్లె గ్రామంలో వెలసిన శ్రీ రామాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మూడు రోజులపాటు స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, జయదేవానంద స్వామిచే ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న భక్తాదులందరికీ గ్రామ భక్తసమాజం మహాప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో వై.వి. శివారెడ్డి, ఆకుల విశ్వనాధరెడ్డి, ఆకుల నాగిరెడ్డి, బోర్వెల్ శివారెడ్డి, నలుబోలు మల్లారెడ్డి, బోయ జయమ్మ, మోహనరెడ్డి, ఎద్దుల సుబ్బ రాయుడు, గొల్ల వెంకటప్ప, చాకలి కొత్తన్న, గొల్ల శివరాం, పూజారి గురువయ్య, యల్లాల నాగలక్ష్మి, కోనేటి సుబ్బమ్మ, బోయ శేషమ్మ, మంగలి వెంకటప్ప, యర్రగొల్ల రాజశేఖర్, బోయ దస్తగిరి, ఆకుల లక్ష్మి దేవమ్మ, ఆదిలక్ష్మి, మారేమడుగుల లక్ష్మిదేవి, యర్రగొల్ల లక్ష్మిదేవి, ఆకుల పుల్లారెడ్డి, రామాపురం శివారెడ్డి,ఎన్. నారాయణ రెడ్డి, జూనూతల నాగేంద్రుడు, సిద్దయ్య, రామసుబ్బన్నతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తాదులందరికీ హైదరాబాదులో ఉంటున్న బోయ షేక్షావలి అన్నప్రసాదానికి సహకరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version