Home Politics Andhra Pradesh స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయంగా పనిచేయాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయంగా పనిచేయాలి

0

మాడుగుల మండలం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం మాడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించారు. శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల లక్ష్యంగా కూటమి పార్టీలతో కలిసి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని పార్టీ తీర్మానించింది. మై టీడీపీ యాప్ ప్రతి కార్యకర్త ఉపయోగించాల్సిందిగా,సోషల్ మీడియాను ఫాలో అవ్వాలని,కేడర్ సంక్షేమం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పలు సేవలు గురించి తెలియజేయడం జరిగింది.ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి ప్రజలకు తెలియజేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరారు. సూపర్ సిక్స్ పధకాలు గురించి నిరంతరం ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే పార్టీ ప్రోటోకాల్ కూడా పాటించవలసిందిగా కోరారు. ప్రతినెల ఐదున విధిగా గ్రామ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు . ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పి అప్పలరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఎన్ సన్యాసిరావు, పుప్పాల రమేష్, పెద్దేరు జలాశయ్య కమిటీ చైర్మన్ అద్దేపల్లి జగ్గారావు, క్లస్టర్ ఇంచార్జీలు బి విజయలక్ష్మి, మజ్జి లక్ష్మీరావు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version