Home Politics Andhra Pradesh కల్తీ పాలు దుర్ఘటన చాలా బాధాకరం

కల్తీ పాలు దుర్ఘటన చాలా బాధాకరం

0

బాధితులకు అండగా ఉంటాకంబాల

తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందాడం, మరో 15మంది చికిత్స పొందుతున్న సంఘటనపై విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు స్పందించారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరం మని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అదుబాటులో లేనప్పటికీ ఈ సంఘటన పై ఓ ప్రకటన విడుదల చేసారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, దీనికి కారమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. కల్తీ పాలు కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి, రామసేన సంస్థ తరుపున తన వంతు సహాయం అందిస్తానని పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version