Tuesday, May 5, 2026
HomePoliticsAndhra Pradeshఅమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ....

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ….

హోం మంత్రి అనిత*

ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే సాధ్యమైంది*

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. అమరావతి రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు హోంమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ‌రావ‌తిపై పోరాడి విజ‌యం సాధించిన రైతుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. అమ‌రావ‌తికి అండ‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇది రైతుల త్యాగాలకు, శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితమన్నారు. అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని పునఃప్రతిష్ఠించిన కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన అన్ని పక్షాలకు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments