Home Politics Andhra Pradesh కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్లండి

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్లండి

0

మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని తిరుపతి జిల్లా మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు పలబాక లక్ష్మి పిలుపునిచ్చారు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మండల నాయకులు,క్లస్టర్ లతో సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా పనబాక లక్ష్మీ మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణపై సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని,వారి మండలాలలో విస్తృత ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం యొక్క విజయానికి దోహదపడాలని తెలియజేశారు,సూపర్ సిక్స్ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేశారని,మహిళలకు ఉచిత బస్సు,ఏడాదికి మూడు సిలిండర్లు, తల్లికి వందనం, మెప్మా మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తూ ప్రజాహితంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తినియోజక వర్గాన్ని దినదినభివృద్ధి చేస్తుంటే, అభివృద్ధి చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష నాయకులు సుధీర్ రెడ్డిపై కావాలనే బురదచలుతున్నారని, ఇది సమంజసం కాదని ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు,ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు మండల నాయకులకు భరోసా కార్యక్రమం నిర్వహించామని,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి విచ్చేసి కార్యకర్తలకు నాయకులకు భరోసానిచ్చి భవిష్యత్తు ప్రణాళికపై వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు,ఆమె ఆధ్వర్యంలో పార్టీని ముందుకు తీసుకుపోతూ కూటమి ప్రభుత్వం యొక్క బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, తొట్టంబేడు టిడిపి మండల అధ్యక్షుడు రావిళ్ళ మునిరాజా నాయుడు,శ్రీకాళహస్తి రూరల్ మండల అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు,గాలి చలపతి నాయుడు,షాకిర్ అలీ,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version