Home News యలమంచిలిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

యలమంచిలిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

0

యలమంచిలి, జయ జయహే న్యూస్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర మూడవ శనివారం కార్యక్రమం వ్యక్తిగత పరిశుభ్రత, కమ్యూనిటీ పరిశుభ్రత” అనే అంశంపై స్వచ్ఛత కార్యక్రమాలు కమిషనర్ ప్రసాద్ రాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సన్యాసమ్మ చెరువు పార్క్ వద్ద మెగా క్లీనింగ్ డ్రైవ్ చేపట్టి జంగల్ క్లియరెన్స్ మరియు ప్లాస్టిక్ చెత్తను క్లియర్ చేశారు. అనంతరం 13 సచివాలయాల పరిధిలో ఉన్న స్కూళ్లలో మరియు కాలేజీల్లో వ్యక్తిగత మరియు కమ్యూనిటీ పరిశుభ్రత అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది. మునిసిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version