Home Politics Andhra Pradesh విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలి

విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలి

0

విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకొని సమాజంలో ఉన్నతలుగా ఎదగాలని విశ్రాంత ప్రిన్సిపాల్ పేడాడ రాంబాబు హితవు పలికారు. శుక్రవారం హీరా మండలం జూనియర్ కళాశాలలో జరిగిన. వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణతో అంకితభావంతో విద్యను అభ్యసించాలని సూచించారు. రానున్న పరీక్షల్లో ఇష్టపడి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని తద్వారా కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు కావాలని సూచించారు. నేటి యువత రేపటి దేశానికి మార్గదర్శకులని ఆ దిశగా ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ఎప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కే అప్పల రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తూరు కళాశాల ప్రిన్సిపాల్ ధనుంజయ రావు కళాశాల కమిటీ చైర్మన్ కాళీ ప్రసాద్, సీనియర్ అధ్యాపకులు బుచ్చబ్బాయి బాలకృష్ణ తదితరులు పాల్గొని విద్యార్థులకు విద్యశాఖ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత, ఈ కళాశాలలోనే పదిఏళ్ళ కిందట పదవి విరమణ చేసిన ప్రిన్సిపాల్ పి రాంబాబుని కళాశాల తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సంస్కృతి కార్యక్రమంలో నిర్వహించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version