Home Politics Andhra Pradesh అంకుపాలెంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మహిళా, పురుష కబడ్డీ పోటీలు

అంకుపాలెంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మహిళా, పురుష కబడ్డీ పోటీలు

0

చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో మూడు రోజులు పాటు నిర్వహించ తలపెట్టిన శ్రీ దుర్గా అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈనెల 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. సందర్భంగా రాష్ట్రస్థాయి మహిళలు పురుషుల కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రోత్సహించారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేను నిర్వాహకులు సత్కరించారు. ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్లబండ్ల పోటీలు, గుర్రo పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version