Home Politics Andhra Pradesh విద్యుత్ కనెక్షన్లకు ఓకే

విద్యుత్ కనెక్షన్లకు ఓకే

0

పెండింగ్ దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్

రెండు నెలల్లో పూర్తి చేయాలి

డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీలో రైతులకు ఊరట లభించింది. పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఆదేశాలు సోమవారం జారీ చేసింది. ఈ నెలాఖరులోగా అనుమతులు జారీ చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 46,113 ఉండగా.. వీటికి రూ.250 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లు మొత్తం 22.30 లక్షలు ఉన్నాయి. కొత్తగా ఇప్పటికే 1.12 లక్షల కనెక్షన్లు మంజూరు చేసింది. పెండింగ్‌లో ఉన్నవి క్లియర్ చేయడానికి మరో 10,000 ట్రాన్స్‌ఫార్మర్లు కేటాయించనుంది. ఈ పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని డిస్కంలను విద్యుత్ శాఖ మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సాగు సీజన్‌కు ముందే వేలాది మంది రైతులకు విద్యుత్ సౌకర్యం లభించే అవకాశం ఉందనే ఒక చర్చ సాగుతోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version