Home Politics Andhra Pradesh 9 న శ్రీనివాస కళ్యాణం

9 న శ్రీనివాస కళ్యాణం

0

* గోడ పత్రిక ఆవిష్కరించిన వి ఎం ఆర్ డీ ఏ చైర్మన్ ప్రణవ్

శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మార్చి 9 న నిర్వహించే శ్రీనివాస్ కళ్యాణం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను వి ఎం ఆర్ డీ ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, కార్యదర్శి మురళీ కృష్ణ ఆవిష్కరించారు. బుధవారం ఉదయం ఆయన ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజానికి ఉపయోగపడేలా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక ధార్మిక కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా మహిళలను ఆధ్యాత్మిక ప్రపంచం వైపు నడిపిస్తూ సనాతన ధర్మ ప్రచారానికి తమ వంతు కృషి చేస్తున్న శ్రీ వెంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ట్రస్టు చీఫ్ డైరెక్టర్ సునితా కొఠారి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం గురజాడ కళాక్షేత్రంలో మార్చి 9న నిర్వహించే శ్రీనివాస కళ్యాణం లో అందరు పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తో పాటు ప్రతిభావంతులైన మహిళలకు ప్రతిభా పురస్కారాలు మహిళలకు విభిన్న సాంప్రదాయ పోటీలు ఉచిత బహుమతులు కూడా ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిది మానేపల్లి లక్ష్మీ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version