Home News శ్రీకాకుళం జిల్లా పెన్షనర్ల సంఘం నూతన కార్యవర్గం

శ్రీకాకుళం జిల్లా పెన్షనర్ల సంఘం నూతన కార్యవర్గం

0

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి, గుంటూరు వారి అనుబంధ శాఖ అయిన శ్రీకాకుళం జిల్లా శాఖ నూతన కార్యవర్గం బుధవారం ఏర్పాటయింది. అధ్యక్షలు రోణంకి రామచందర్రావు , జనరల్ సెక్రటరీ అంకం ధర్మ రావు సమక్షంలో రాష్ట్ర సంఘము సూచనలు నగరంలో అధిక సంఖ్యలో ఉన్న పెన్షనర్లకు సేవలను అందించుటకు గల ఆవశ్యకత రీత్యా, సంఘ నిర్మాణం నిర్వహణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిచే శ్రీకాకుళం నగర శాఖ అడ్- హాక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ భవనంలో హాజరైన విశ్రాంత ఉద్యోగుల సమక్షంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవాధ్యక్షులుగా దొంతం పార్వతీశం , కన్వీనర్/అధ్యక్షులుగా బొణిగిభాస్కరరావు, సభ్యులు /ప్రధాన కార్యదర్శిగా తవిటన్నగ, సభ్యులు/ఆర్థిక కార్యదర్శిగా ఎన్వి రమణ , సభ్యులు/అసోసియేట్ ప్రెసిడెంట్ పి రాంబాబు , సభ్యులు/సహాయ కార్యదర్శిగా పి శాంతరావు
నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యేంతవరకు తాత్కాలికంగా నిర్దేశిత బాధ్యతలు నిర్వహించుటకు అడ్డహాక్ కమిటీగా నియమింపబడ్డారు. వీరు నగరంలో విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. త్వరలో నూతన నగర కమిటీ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version