భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం ఉక్కునగరం శ్రీ సత్య సాయి మందిరంలో భక్తి పూర్వక వాతావరణం నెలకొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తుల సమూహం చేత విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామాలు, లింగాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్దలతో నిర్వహించబడింది.
సాయి నామస్మరణతో మందిర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శక్తితో పరిపూర్ణమై, పాల్గొన్న భక్తుల మనసుల్లో శాంతి, ఆనందం, దైవ అనుభూతి వెల్లివిరిసింది. భీష్మ పితామహుని త్యాగం, ధర్మ నిష్ఠను స్మరిస్తూ నిర్వహించిన ఈ పారాయణ కార్యక్రమం భక్తులచే విశేషంగా ఆదరించబడింది.
ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా భక్తులందరూ భగవన్నామ స్మరణ ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసుకొని, ఆధ్యాత్మిక జీవనానికి ప్రేరణ పొందారు.
