జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరగా వున్నశ్రీ నూకాలమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణతో
భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్బంగా
అమ్మ వారి ఉత్సవ మూర్తికి పంచామృత అభిషేకాలు మూలవిరాట్ కు ఏకాదశ హారతి పూజలు నిర్వహించడం జరిగింది.
వేద దర్బారు సేవ చతుర్వేద స్వస్తి నీరాజన మహా మంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహించారు.
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం
ఆలయప్రాంగణం లోని
కళ్యాణ కళా వేదిక వద్ద
శ్రీ నర్మదా బాణలింగేశ్వర స్వామి వారికి లోక కళ్యాణార్ధం సహస్ర నామాలతో బిళ్వ దళార్చన… పంచామృతాలతో అభిషేకాలునిర్వహించనున్నట్టు ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆలయ కమిటీ చైర్మన్ రొంగలనాగేశ్వరరావు తెలిపారు.విరివిగా పాల్గొన్న భక్తులలోకన్నాపురం కుచెందిన గొట్టుముక్కల తులసీ ప్రసాదరాజు అన్నపూర్ణ దంపతులు అమ్మ వారికి రూ.5,116/- సమర్పించారనితెలిపారు.
అల్లూరి నాగరాజు వర్మ శిరీష దంపతులు వెండి చీర తయారీకి 100 గ్రాములు వెండి కె.వీరభద్రుడు కుటుంబ సభ్యులు రూ 5,116/ లు విరాళంగా సమర్పించారని డాక్టర్ రాజాన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి
ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెనరాంబాబు పాల్గొన్నారు.
చిట్లూరి సుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం అందించారు.
