Home Politics Andhra Pradesh జాతీయ యోగ పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్‌కు ఎస్పీ సన్మానం

జాతీయ యోగ పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్‌కు ఎస్పీ సన్మానం

0

జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ & యోగా క్లస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2025 పోటీల్లో ప్రతిభ కనబరిచి రెండు కాంస్య పతకాలు సాధించిన తూర్పుగోదావరి జిల్లా మహిళా కానిస్టేబుల్ ఆర్. రోహిణిని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ అభినందించి సన్మానించారు.
యోగాసన గ్రూప్ ఈవెంట్, యోగాసన ఆర్టిస్టిక్ ఫెయిర్ ఈవెంట్స్‌లో విశిష్ట ప్రదర్శనతో కాంస్య పతకాలు గెలుచుకున్న రోహిణి (డబ్ల్యుపీసీ-1469, కంట్రోల్ రూమ్) గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి సాధించిన పతకాలను చూపించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ ఆమెకు శాలువా కప్పి, పతకాలతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విధుల్లో నిబద్ధతతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
జిల్లా పోలీసు విభాగానికి కీర్తి తీసుకువచ్చిన రోహిణిని సహచర సిబ్బంది కూడా అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version