Saturday, April 18, 2026
HomeNewsజవ్వాది గెడ్డ సమస్య పరిష్కరించండి

జవ్వాది గెడ్డ సమస్య పరిష్కరించండి

మాడుగుల మధ్య నుంచి ప్రవహిస్తున్న జవ్వాది గెడ్డ సమస్యకు శాశ్వత సమస్య పరిష్కారం చేయాలని స్థానిక న్యాయవాది ఎస్ ప్రసాదరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం మాడుగుల పి 4 కార్యాలయంలో జరిగిన ప్రజా వేదిక లో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కి వినతి పత్రం అందజేశారు. ఈ గెడ్డ వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇటు,అటు గెడ్డ మార్గంలో రోడ్డు,కాలువలు నిర్మించారని,మధ్యలో విడిచిపెట్టడం వల్ల మురుగునీరు,వర్షపు నీరు నిలువ ఉండి అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఇది చిరకాల సమస్యగా మిగిలిపోతుందన్నారు.కాబట్టి తక్షణ సమస్య పరిష్కరించాలని కోరారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments