Home Politics Andhra Pradesh ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం

ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం

0

శ్రీరామ నవమి సందర్భంగా మాడుగుల గవరవీధిలో వేంచేసి యున్న శ్రీ వైబోగ సీతా రామాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ సీతారాములు వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని నిర్వహించుకున్నారు. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.ఆలయ అర్చకులు ప్రమోద్ ఆధ్వర్యంలో అర్చక బృందం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ దాతలు జల్దు సారధి ఈ కార్యక్రమానికి తాళిబొట్టు అందజేయగా, మరో భక్తుడు పెంటకోట రామకృష్ణ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఏప్రిల్ 3 వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది.అలాగే స్థానిక పార్థసారధి ఆలయంలో కూడా శ్రీరామ నవమి వాడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది దుక్కా దుర్గారెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version