ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టిన సంఘటనలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలవగా, మరో 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. కేసు నమో చేసినట్టు చోడవరం పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలు పరిశీలిస్తే చోడవరం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అడ్డూరు నగిరెడ్డి వారి కల్లాలు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు ముందు భాగం నుజు నుజ్జావుగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
