Home Politics Andhra Pradesh సెల్ టవర్ ఊరు చివర్లో ఏర్పాటు చేయండి

సెల్ టవర్ ఊరు చివర్లో ఏర్పాటు చేయండి

0

మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో ఎయిర్టెల్ వారు ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ గ్రామ శివారులో ఏర్పాటు చేయాలని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ టవర్ ను జనవాసాలు మధ్య, పాఠశాలలో పాల కేంద్రం కి దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భయంకరమైన క్యాన్సర్ అంటే వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, పాఠశాల విద్యార్థులు రేడియేషన్కు గురి అయ్యే అవకాశం ఉందని కాబట్టి అధికారులు చర్యలు చేపట్టి ఊరు శివారులో టవర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు మమ్మల్ని క్రమంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సోమవారం ఎండిఓ కే అప్పారావు కలిసి అఖిలపక్షానికి చెందిన ప్రతినిధులు వినతి పత్రం
అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్తామని ఎండిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలుగుదేశం వైసిపి నాయకులు కోసూరు అప్పారావు, కొల్లి మల్ల నాగరాజు, బొద్దప్పు ఆదినారాయణ, బొద్దప్ప భాస్కరరావు, ఉండూరు శ్రీనివాస్, ఖాతా సత్య రావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version