పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో జరిగిన ఘటనలో 57 మందిపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం దేశ చరిత్రలోనే అరుదైన దారుణమని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద బెయిల్‌పై విడుదలైన మహిళలు, పురుషులకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, డిప్యూటీ స్పీకర్ రామారావు కృష్ణంరాజు తన స్వార్థ రాజకీయాల కోసం దళితులపై అక్రమ కేసులు మోపించడం అత్యంత ఖండనీయమన్నారు. నిర్దోషులైన 57 మందిపై దేశద్రోహం కేసులు పెట్టడం న్యాయ వ్యవస్థను అవమానపరచడమేనని మండిపడ్డారు.
ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, “ఇలాంటి అన్యాయాలపై స్పందించకుండా మౌనం వహించడం అంటే గడ్డి తింటున్నట్టే” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే రాఘురామరాజును డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
“57 మందిపై దేశద్రోహం కేసులా..? చంద్రబాబు, పవన్ గడ్డి తింటున్నారా – హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు”
RELATED ARTICLES
