Home Politics Andhra Pradesh ఆదిత్య కళాశాలలో సావిత్రి సినిమా సురూ

ఆదిత్య కళాశాలలో సావిత్రి సినిమా సురూ

0

శ్రీకాకుళం జిల్లాలో షూటింగ్ కు చిత్ర యూనిట్ ప్రాధాన్యత

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఐతం లో సావిత్రి టైటిల్ గల సినిమాను షూటింగ్ను ప్రారంభించారు, బిగ్ బాస్ ఫేమ్ నటులు ఇందులో నటిస్తున్నారు.

ఐతం కళాశాల లో శ్రీలక్ష్మి కృష్ణ ఫిలిం సిటీ యూనిట్ సమర్పిస్తున్న
సా v త్రి మూవీ టైటిల్, గోడపత్రికను కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సినిమాకు కృష్ణ మాయ దర్శకత్వం వహిస్తున్నారు, నిర్మాతగా వి విజయ్ వ్యవహరిస్తున్నారు,

ఈ సినిమాలో బిగ్ బాస్ సీజన్ 2 లో గుర్తింపు పొందిన సామ్రాట్ రెడ్డి, బిగ్ బాస్ సీజన్ 9 డిమాన్ పవన్, రాను బొంబాయి కి రాను పాట ద్వారా గుర్తింపు పొందిన లిఖిత, బిగ్ బాస్ సీజన్ 9 టెంపర్ వంశీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సావిత్రి సినిమా షూటింగును నాలుగు రోజులపాటు ఆదిత్య కళాశాలలో నిర్వహిస్తున్నారు, అలాగే ఇచ్చాపురం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామని నిర్వాహకులు తెలిపారు,
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో షూటింగ్ నిర్వహించడం చాలా ఆనందదాయకమని భవిష్యత్తులో చిత్ర యూనిట్ మంచి విజయాలు సాధించాలని కళాశాల డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు ,డాక్టర్ డి యుగంధర్ జై సురేష్ కుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, పిరియా రమేష్ కుమార్, ఎం మురళీధర్, చిత్ర యూనిట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version