Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సతీష్ కుమార్ వినతిపత్రం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సతీష్ కుమార్ వినతిపత్రం

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలపై జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు*
ఈ సందర్భంగా జిల్లాలోని గ్రంథాలయాల ప్రస్తుత స్థితిగతులను ఉప ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది.
• 2008-09 నుండి ప్రభుత్వం నుంచి సుమారు రూ. 30.02 కోట్ల గ్రాంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్ల నుండి రూ. 200 కోట్లకు పైగా, గ్రామ పంచాయతీల నుండి రూ. 24 కోట్లు, మరియు మున్సిపాలిటీల నుండి రూ. 73 లక్షల గ్రంథాలయ పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉంది.
• నిధుల కొరత కారణంగా సిబ్బంది వేతనాలు, పెన్షన్ల చెల్లింపు కష్టతరంగా మారింది.
• జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి సొంత భవన నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది.
మొత్తం 132 మంజూరైన పోస్టులలో 87 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 45 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు.• మన్యప్రాంత మండలాల్లో 10 అత్యాధునిక డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు.
• ఉత్తరాంధ్రలో జాతీయ స్థాయి తెలుగు డిజిటల్ లైబ్రరీ నిర్మాణం.
• ప్రతి గ్రామ పంచాయతీలో మరియు విశాఖ నగరంలోని ప్రతి వార్డులో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. చదువు సంస్కృతిని కాపాడటంలో గ్రంథాలయాల పాత్ర కీలకమని, పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదల మరియు గ్రంథాలయాల ఆధునీకరణకు ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మన్య ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments