Home Politics Andhra Pradesh అసాంఘిక శక్తుల అడ్డాగా పవిత్ర స్థలాలు

అసాంఘిక శక్తుల అడ్డాగా పవిత్ర స్థలాలు

0

ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు జరపాలి టెక్కలి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో నీ , కోర్టు, పాత ఆసుపత్రి, అగ్నిమాపక కార్యాలయం సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం, అంబేద్కర్ కూడలి వద్ద పార్క్ , టెక్కలి పోలీస్ స్టేషన్ సమీపంలోనీ డాక్టర్ అంబేద్కర్ విజ్ఞాన భవనం కాలీ స్థలాలు చీకటి సమయాల్లో అసాంఘిక శక్తుల నిలయాలు గా మారి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని శ్రీకాకుళం జిల్లా సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు చల్లా రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మూడు స్థలాల్లో అసాంఘిక కార్యక్రమాలు, మందు బాబుల ఆగడాలు మితిమీరీ పోతున్నాయని సంబంధిత ప్రభుత్వ అధికారులు ఈ స్థలాలపై దృష్టి సారించి జాతీయ నాయకులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు , అభిమానులకు అవమానం జరక్కుండా తక్షణ చర్యలు తీసుకోవాలని , స్థానికులు ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం కృష్ణమూర్తి కు సంబంధిత సమస్యలపై విజ్ఞప్తి చేశామని ఆర్డీవో స్పందించి తక్షణమే దర్యాప్తు చేస్తామని తెలిపారని రామారావు అన్నారు, ఆయనతోపాటు సంఘం ప్రతినిధులు ఆక్కురాడ మాధవ రావు, పేర నాగేశ్వరరావులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version