Home Politics Andhra Pradesh రూ. 18 కోట్ల అభివృద్ధి పనులు

రూ. 18 కోట్ల అభివృద్ధి పనులు

0

జీవీఎంసీ 7, 8 వార్డుల్లో రూ. 12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అలాగే 8 వ వార్డులో రూ. 6 కోట్లతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ భవనం, స్మశానం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాది కాలంలో మధురవాడ జోన్ లో రూ. 50 కోట్ల పనులు చేపట్టామన్నారు. 5, 7, 8 వార్డుల్లో రెండు రోజుల్లో రూ. 38 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని.. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మధురవాడ జోన్ లో మరో రూ.10 కోట్ల పనులకు ఆమోదం లభించిందని వివరించారు. జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, కార్పొరేటర్లు లొడగల అప్పారావు, పిల్లా మంగమ్మ, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, మొల్లి లక్ష్మణరావు, చెట్టుపల్లి సన్యాసిరావు, పిల్లా వెంకట్రావు, కె. అచ్యుతరావు, గరే గుర్నాథ్, మన్యాల సోంబాబు, కంటుభుక్త రామానాయుడు, శాఖారి శ్రీనివాస్, నాగోతి సత్యనారాయణ, వాండ్రాసి అప్పలరాజు, మామిడి దుర్గారావు, లొడగల జానకిరామ్, పోతిన ప్రసాద్, నాగోతి సూర్య ప్రకాష్, ఈగల రవికుమార్, పోలిశెట్టి నాగేశ్వరరావు చెట్టుపల్లి గోపీ, అక్కరబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version