కరిమద్దెల గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో మంగళవారం ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు కె. సిద్ధారెడ్డిచే శ్రీమద్రామాయణంపై ప్రవచనం, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు, శుక్రవారం వరకు ఉపన్యాసాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, శనివారం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మాణమైన శ్రీ మాతా మారెమ్మ దేవస్థానం నందు భజన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్త సమాజ సభ్యులు ఎ.నారాయణరెడ్డి, ఎ. సోమసుందర రెడ్డి, యం. శివారెడ్డి, కె. శివారెడ్డి, బి. రామకృష్ణారెడ్డి, కె. వెంకట రామిరెడ్డి, యం. అయ్యన్న, కె. నారాయణ, ఎస్. శేఖర్ రెడ్డి, జి వెంకట రెడ్డి, కె. తులసిరెడ్డితో పాటు భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
