Friday, April 24, 2026
HomeDevotionalఅన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రామసేన సభ్యులు

అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రామసేన సభ్యులు

గోకవరం మండలం గాదెలపాలెం గ్రామంలోని గ్రామ దేవత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి 3వ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామసేన సభ్యులు పాల్గొన్నారు. తొలిత వారు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు పదివేలు రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. వాటిని రామసేన సభ్యులు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు బత్తుల నానాజీ, కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, దేశాల నరేష్, తుమ్మల బుజ్జి, మండే గౌతంమ్, పద్దరాజు, నెల్లి శ్రీను, గని రాజు, అంబటి శ్రీను, రాంబాబు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments