Home Politics Andhra Pradesh కూటమి సర్కార్‌పై ప్రజాగ్రహం… వైఎస్ఆర్సీపీ బలోపేతమే లక్ష్యం

కూటమి సర్కార్‌పై ప్రజాగ్రహం… వైఎస్ఆర్సీపీ బలోపేతమే లక్ష్యం

0

ముంచంగిపుట్టులో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తలకు అండగా జగన్.. ‘బీమా’తో భరోసా: జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కూడా గడవకముందే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైందని, రాబోయే ఏ ఎన్నికల్లోనైనా అధికార పక్షానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం అధ్యక్షులు, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్పష్టం చేశారు. శుక్రవారం ముంచంగిపుట్టులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ సమావేశానికి పాడేరు మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, అరకు-పాడేరు నియోజకవర్గాల పరిశీలకులు ఏడవక సత్యరావు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో సుభద్ర మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.సైనికుల్లా పనిచేసే కార్యకర్తలకు ‘బీమా’ రక్ష పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కాపాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారని సుభద్ర తెలిపారు. కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ గారు ‘ఇన్సూరెన్స్’ (బీమా) సౌకర్యాన్ని తీసుకొస్తున్నారని వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. సంస్థాగత బలోపేతంపై దృష్టి
ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాటం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు ఆమె సూచించారు. మండల స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎ. సీతమ్మ, వైయస్సార్సీపి మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు (రెడ్డి ), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version