Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshపోలీసు అధికారుల సస్పెన్షన్ కాదు అరెస్టు చేయాలి

పోలీసు అధికారుల సస్పెన్షన్ కాదు అరెస్టు చేయాలి

విదసం డిమాండ్, కాకినాడ కు చెందిన వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన పోలీసులను సస్పెన్షన్ చేస్తే కుదరదని, తక్షణమే వారిని అరెస్టు చేయాలని విస్తృత దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు. సుబ్రమణ్యం హత్య కేసు పునః దర్యాప్తు నిమిత్తం ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ నేతృత్వంలోనీ సిట్ నివేదిక , నిన్న సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు భార్యతో పాటు పోలీసు అధికారులును తక్షణమే అరెస్టు చేయాలని విదసం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల అనుమానాస్పద వైఖరి పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపద్యంలో దోషులతో కుమ్మక్కైన పోలీసు అధికారులను సస్పెన్షన్ తో సరిపెట్టకుండా చార్జిషీట్ లో పేర్లు చేర్చాలని డిమాండు చేసారు.
ఈ కేసులో లో మొదటి నుండి అనేక అనుమానాలు వెంటాడాయని ఈ హత్య పై సీబీఐ విచారణ కోసం విదసం నాయకత్వం నాటి గవర్నర్ ను , కూటమి సర్కారు లో హోమ్ మంత్రికి విజ్ఞప్తి చేసిన క్రమంలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారితో సిట్ వేసిందన్నారు .. సిట్ చార్జిషీట్ లో ఏ 2 గా అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గను నమోదు చేసినప్పటికీ ఆమెను ఇంకా అరెస్టు చేయలేదన్నారు. ఆమే పారిపోయేoదుకు సహకరించిన అధికారులను కూడా చార్జిషీట్ లో చేర్చాలన్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ భార్య లక్ష్మీ దుర్గను కాపాడి సాక్ష్యాలను తారుమారు చేసిన నాటి పోలీసు అధికారుల పై రెడ్ విత్ 34, ఐపీసీ 193, 201,208 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 4 ప్రకారం నిందితులుగా చేర్చి వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో జాజి ఓంకార్, సోడదాసి సుధాకర్ , గుడివాడ ప్రసాద్, యు ఎస్ రాజు, గుడివాడ భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments