గుర్ల మండలంలోని కలవచర్ల గ్రామంలో ఇటీవల ఉపాధి హామీ పని చేస్తుండగా రౌతు వెంకటరమణ అనే వ్యక్తి మరణించాడు. మృతి చెందిన వెంకటరమణ మరణించే ముందు నెల వరకూ వృద్ధాప్య పింఛన్ను ప్రభుత్వం నుండి అందుకునే వాడు. మరణించిన తర్వాత ఆయన పించన్ ను స్పవుజ్ కోటాలో భార్య రౌతు మంగమ్మకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ అధికారులు బుధవారం మంగమ్మకు పింఛన్ డబ్బులు ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువనేత బెవర కూర్మారావుతో పాటు యువకులు పాల్గొన్నారు.
