Home Politics Andhra Pradesh మార్క్పేడ్ సమావేశానికి హాజరైన పాక్స్ అధ్యక్షులు

మార్క్పేడ్ సమావేశానికి హాజరైన పాక్స్ అధ్యక్షులు

0

విజయవాడలో గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్ పెడ్) వారి 13 వ సర్వసభ్య సమావేశానికి మాడుగుల మండలం నుంచి కింతలు పిఎసిఎస్ చైర్ పర్సన్ జిల్లా పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉండూరు దేవుడు,, మాడుగుల పిఎసిఎస్ చైర్ పర్సన్ కొట్నాల త్రినాథ్,, వీరనారాయణ పిఎసిఎస్ చైర్పర్సన్ పతివాడ వరహాల నాయుడు,, కేజీ పురం పిఎసిఎస్ చైర్పర్సన్ సెరగడం ఆది బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం మార్క్ఫెడ్ చైర్మన్ కుర్రోతు బంగారు రాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మార్క్ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు,, తులసి రెడ్డి,, శశిభూషణ్ రెడ్డి,, ఆప్కాబ్ సీఈవో తో పాటు రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్లు సీఈవోలు సుమారు 800 మంది హాజరైనారు.. ఈ సమావేశంలో 2025-26 సంవత్సరములో సుమారు 6 వేల కోట్లతో పౌరసరఫలాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ చేయడం,ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధరలతో కందులు, మినుములు, పెసలు, సెనగలు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు కొర్రలు తదితర వాణిజ్య పంటలన్నీ కొనుగోలు చేసి విత్తనాలు సప్లై కూడా చేయించడం , మార్క్ఫెడ్ ద్వారా పొగాకు రైతులని మద్దతు ధరతో కూటమి ప్రభుత్వ ఆదేశం ప్రకారం రైతుల నుంచి పొగాకు సేకరణ కూడా చేపట్టడo, మార్క్ఫెడ్ ద్వారా పిఎసిఎస్ రైతులందరికీ ఇరువులు సప్లై విషయంలో కలెక్టర్ ఆదేశాల ప్రకారం పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా రైతులు కోపరేటివ్ సొసైటీలు రైతు సేవా కేంద్రాల ద్వారా ఇరువుల్ని తీసుకునేలాగా రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని తెలియజేసారు. అలాగే సొసైటీల ద్వారా పశువులకు తక్కువ ధరకి మంచి పోషకాలు ఉన్న పశుదానా సప్లై చేయమని కోరడం జరిగింది. దానికి చైర్మన్ అంగీకారం తెలియజేశారు. సొసైటీల ద్వారా అమ్ముతున్న ఎరువులు పై ఇన్సెంటివ్ ఇదివరకు ఇస్తున్న దానికంటే పెంచాలని చైర్మన్లు కోరడం జరిగింది. అలానే డీసీఎంఎస్ చైర్మన్ లు కూడా వారికి క్రెడిట్ లోన్స్ లిమిట్ పెంచాలని కూడా వివిధ జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ లు కూడా కోరడం జరిగింది. దానికి చైర్మన్ అంగీకారం కూడా తెలియజేశారన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version